NTV Telugu Site icon

7000-Year-Old Road: మధ్యదరా సముద్రం కింద బయటపడిన 7000 ఏళ్ల నాటి రోడ్డు

7000 Year Old Road

7000 Year Old Road

7000-Year-Old Road: ఎన్నో వేల ఏళ్ల నాటి సంస్కృతులు ఈ మహాసముద్రాల కింద నిక్షిప్తం అయి ఉన్నాయి. దీనికి సజీవ సాక్ష్యమే తాజా మధ్యదరా సముద్రం కింద కనుగొనబడిన ఓ రహదారి. పురావస్తు పరిశోధకులు పరిశోధనలు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పదులు కాదు, వందలు కాదు ఏకంగా 7000 ఏళ్ల క్రితం నాటి రోడ్డును పరిశోధకులు కనుగొన్నారు. మధ్యదరా సముద్రం దిగువన సముద్రపు మట్టి నిక్షేపాల కింద ఈ రహదారిని బయటపడింది.

Read Also: CSK vs DC: నత్తనడకన చెన్నై ఇన్నింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

ఈ రహదారి యూరప్ దేశం క్రోయేషియన్ ద్వీపంలో ఉన్న కోర్కులా ద్వీపతీరంలో హ్వర్ సంస్కృతికి సంబంధించిందిగా చరిత్రకారులు నమ్ముతున్నారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పుతో జాగ్రత్తగా రాతిపలకతలో పేర్చబడింది. కార్బన్ డేటింగ్ ప్రకారం.. క్రీస్తుపూర్వం 4900 ఏళ్ల క్రితం అంటే దాదాపుగా 7000 ఏళ్ల క్రితం ఇక్కడ మనుషులు స్థిర నివాసం ఉన్నారని, ఈ రోడ్లపై నడిచారని క్రొయేషియా యూనివర్సిటీ ఆఫ్ జదర్ పరిశోధకులు తెలిపారు. దాదాపుగా 5000 BCEలో హ్వార్ సంస్కృతి ఇక్కడ వర్థిల్లినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. వీరు రైతులు, పశువుల కాపరులుగా తీరం వెంబడి చిన్న, ఏకాంత కమ్యూనిటీలుగా నివసించారని పరిశోధకులు తెలిపారు.

తాజాగా జరిగిన ఆవిష్కరణలు సముద్రపు అడుగు భాగంలో కోర్కులా ద్వీపంలోని వెలా లుకా సమీపంలోని గ్రాడినా బే సమీపంలో జరిగాయి. ఈ ప్రాంతంలో చెకుముకి బ్లేడ్లు, రాతి గొడ్డళ్ల వంటి నియోలిథిక్ కళాఖండాలు కనుగొనబడ్డాయి. కాంక్రీట్ నిర్మాణమే కాకుండా అత్యంత ఆకర్షనీయమైన విస్తృతమైన గట్లు గట్లుగా ఉండే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇది నీటి సరఫరాకు సహాయపడే విధంగా రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు. హ్వార్ సంస్కృతి, వారి జీవన విధానం గురించి మనకు తెలియనవి ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.