Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు ఆగడం లేదు. ఆ దేశంలో మరో హిందువును దారుణంగా కొట్టి చంపారు. కాళిగంజ్ ప్రాంతంలో హోటల్, స్వీట్ షాప్ పడిపే లిటన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిని హత్య చేశారు. ఒక చిన్న వాగ్వాదం తీవ్రంగా మారి, ఆయనపై వినియోగదారుల గుంపు దాడి చేయడంతో మరణించారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. మొదట ఒక కస్టమర్ లిటన్ దాస్ షాపులో పనిచేసే అనంత్ దాస్‌తో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితిని తీవ్రం కావడంతో తన ఉద్యోగిని రక్షించేందుకు లిటన్ జోక్యం చేసుకున్నాడు. అయితే, ఆయన టార్గెట్‌గా దాడికి పాల్పడటంతో ప్రాణాలు విడిచారు.
Read Also: Medaram Jatara: రేపు మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయం తెలుసుకోండి
కోపోద్రిక్తంగా ఉన్న గుంపు ముందుగా లిటన్ దాస్‌ను పిడికిలితో గుద్ది, కాళ్లతో తన్ని, ఆ తర్వాత పారతో కొట్టడం ప్రారంభించారు. దీంతో దాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాయం చేయడానికి వచ్చేలోపే అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ సంఘటనలతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనికి ముందు మరో సంఘటనలో ఒక పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న హిందూ ఉద్యోగిని కారుతో ఢీకొట్టి చంపేశారు. డబ్బులు చెల్లించకుండా వెళ్తున్న ఒక కారును ఆపే ప్రయత్నం చేసిన రిపన్ సాహా అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. పెట్రోల్‌కు డబ్బు చెల్లించకుండా పారిపోతున్న సమయంలో, సాహా కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులు అబుల్ హషెం అలియాస్ సుజన్ (55), అతని డ్రైవర్ కమల్ హుస్సేన్ (43)లను అరెస్టు చేశారు. సుజన్ రాజ్‌బారి జిల్లాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) మాజీ ట్రెజరర్.
