Site icon NTV Telugu

Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం.. 60 మంది దుర్మరణం

Burkina Faso Crime

Burkina Faso Crime

60 People Killed In Burkina Faso By Men In Military Uniforms: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బుర్కినాబే సాయుధ దళాల దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు.. 60 మంది పౌరులకు ఘోరంగా హతమార్చారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ప్రాసిక్యూటర్ లామిన్ కబోర్ మాట్లాడుతూ.. యతెంగా ప్రావిన్స్‌లోని కర్మ అనే గ్రామంలో ఈ దాడి జరిగిందని, దీనిపై దర్యాప్తు ప్రారంభించబడిందని తెలిపారు. ఇస్లామిక్ గ్రూప్‌తో సంబంధం కలిగి ఉన్న అల్‌ఖైధా, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. అయితే.. ఈ దాడికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రకటనలో ఇంతకుమించి మరే వివరాలు వెల్లడించలేదు. అంతకుముందు.. ఏప్రిల్ 15వ తేదీన కూడా ఒవాహిగౌయా సమీపంలోని ఉత్తర బుర్కినా ఫాసోలోని అదే ప్రాంతంలో.. కొందరు గుర్తు తెలియని దుండగులు సైన్యం, స్వచ్ఛంద దళాలపై దాడికి ఎగబడ్డారు. ఈ దాడిలోనూ 40 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు.

Balesh Dhankar: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం

కాగా.. ఒకప్పుడు బుర్కినా ఫాసో ఎంతో ప్రశాంతంగా ఉండేది. జనాలు ఎంతో సంతోషంగా తమ జీవన విధానాన్ని కొనసాగించేవారు. కానీ.. ఎప్పుడైతే అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధమున్న కొంత మంది జిహాదీలు ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డారో, అప్పటి నుంచి అక్కడ అశాంతి మొదలైంది. ఆ జిహాదీలు వేలాదిమందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. 2012లో మాలిలో టువరెగ్ వేర్పాటువాద తిరుగుబాటును ఇస్లామిస్టులు హైజాక్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ అల్లర్లు మొదలయ్యాయి. అక్కడి నుంచి క్రమంగా వాళ్లు తమ అరాచకాల్ని నైగర్, బుర్కినా ఫాసోకి వ్యాపింపచేశారు. ఎంతోమంది అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకున్నారు. వీళ్ల ధాటికి దాదాపు 20 లక్షల మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. గతేడాది రెండుసార్లు ఘర్షణలు చెలరేగాయి కూడా!

Flights Safe Land: గాల్లో అంతరాయం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం

Exit mobile version