NTV Telugu Site icon

శృంగారం కోసం 11 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. నచ్చకపోతే మరోపెళ్లి

addicted to marriage

addicted to marriage

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది.. కొందరికి మందు వ్యసనం.. ఇంకొందరికి డబ్బు వ్యసనం.. మరికొందరికి అమ్మాయిలు.. తిండి.. డ్రగ్స్ ఇలా చాలా వ్యసనాలు ఉన్నాయి. కానీ , మీరెప్పుడైనా పెళ్లి వ్యసనం విన్నారా.. అది ఒక మహిళ ఈ వ్యసనానికి బానిసగా మారిందట.. ఆమె ఈ వ్యసనంతో ఇప్పటివరకు 11 మందిని పెళ్లి చేసుకున్నదట.. త్వరలోనే 12 వ పెళ్లికి కూడా సిద్ధం అయ్యింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఏంటి..? అనేది తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన ఒక టీవీ ఛానెల్ ‘అడిక్టెడ్ టు మ్యారేజ్’ అనే ఓ షో నిర్వహిస్తోంది. ఇందులో పెళ్ళికి ఎవరు బానిసగా మారారు.. ఎలా మారాల్సి వచ్చింది.. దానికోసం వీరు ఏం చేస్తారు అనేది చెప్తారు. అయితే ఇటీవల ఈ షో కి అమెరికాకు చెందిన మోనెట్ డయాస్(52) అనే మహిళ వచ్చింది. ఆమె తనకు మ్యారేజ్ అడిక్షన్ ఉందని చెప్పుకొచ్చింది.. అయితే ఈ షోకి వచ్చిన వారికంటే తనకి ఆ వ్యసనం కొద్దిగా ఎక్కువే ఉన్నదని చెప్పుకొచ్చింది.

రెండేళ్ల వయస్సులోనే తాను ఒక అబ్బాయి మీద మనసు పారేసుకున్నానని, ఇలా తన 20 ఏళ్ళు వచ్చేసరికి 30 మంది వరకు అబ్బాయిలకు ప్రపోజ్ చేయగా.. తనకు 20 సార్లు అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తాను 11 పెళ్లిళ్లు చేసుకున్నానని, అందరికి రెండు మూడు వారాలకే విడాకులు ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఆమె బట్టలు మార్చినట్టు మొగుళ్లను మారుస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆమె భర్తల పేర్లు గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నారట..

తనకు పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంటుందని, ఎప్పుడు తనను పెళ్లి కూతురిగా ముస్తాబు చేస్తున్నట్లు, తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ ఊహాగానాలు నన్ను ముంచెత్తుతాయని తెలిపింది. ఇక ఈ పెళ్లిళ్లకు వారు ఒప్పుకోవడానికి మరో కారణం ఉందని కూడా చెప్పుకొచ్చింది. తనకు నచ్చిన అబ్బాయితో డేటింగ్ చేస్తా కానీ శృంగారానికి ఒప్పుకోను అని, అప్పుడు అతడు పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు.. అప్పుడు పెళ్లి చేసుకొని శృంగారంలో పాల్గొంటాను అని చెప్పుకొచ్చింది.

అయితే ఈ 11 మందితో శృంగారం అయితే చేశాకాని వారిపై ప్రేమ రాలేదని చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో 12వ పెళ్ళికి సిద్దమైనట్లు తెలిపిన మోనెట్ డయాస్ ఈసారి తాను పెళ్లిచేసుకోబోయేవాడు తనను పూర్తిగా అర్ధం చేసుకున్నాడని, అతడితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి ఈ పెళ్లి ఎన్ని రోజులు నిలుస్తుందో చూడాలి అంటూ ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక ఈమె కథ తెలిసిన వాళ్లందరూ ఇదెక్కడి వ్యసనం రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు.