NTV Telugu Site icon

5000 Years Fridge: 5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. దిమ్మతిరిగే ట్విస్ట్

5000 Years Old Fridge

5000 Years Old Fridge

5000 Years Old Fridge Found In Iraq: పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రను వెలికితీయడంలో ఎల్లప్పుడూ బిజీగానే ఉంటారు. అప్పట్లో జనాలు ఎలా నివసించేవారు, ఏయే ఆవిష్కృతులు చేపట్టారు? అనే అంశాలపై పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలకు నమ్మశక్యం కాని కొన్ని అద్భుత ఘటనలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఇరాక్‌లో అలాంటి అద్భుతమే ఒకటి వెలుగుచూసింది. అక్కడ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో.. దాదాపు 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్ దొరికింది. అంతకుమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అందులో బీర్, దాన్ని తయారు చేసేందుకు వాడిని రెసిపీని కూడా కనుగొన్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

First Night: ఫస్ట్‌నైట్ స్వర్గం చూపించిన పెళ్లికూతురు.. నిద్రలేచి చూసేసరికి..

సుమేరియన్ నాగరికతకు ముఖ్య కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. ఈనేపథ్యంలో 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ బయటపడింది. అందులో ఆ కాలం నాటి ఓవెన్, బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలు బయటపడ్డాయి. మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే.. ‘జీర్‌’ అని పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్‌ బయటపడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాదు.. ఆ బీర్‌ని తయారు చేసేందుకు వినియోగించే ఓ రెసిపీని కూడా సైంటిస్టులు గుర్తించారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాలు సంయుక్తంగా చేపట్టిన తవ్వకాల్లో ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్ ఫోటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మాగ్నెటోమెట్రీ, మైక్రో-స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి.. ఈ పరిశోధనలు చేపట్టారు.

Heeramandi: వ్యభిచారులుగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఏ రేంజ్ లో చూపిస్తారు

Show comments