ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలను కూడా రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం చేస్తోంది.. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ఇప్పటికే ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి ముందుకు కదులుతోంది.. ఇక, యుద్ధంపై కీలక ప్రకటన చేసింది రష్యా… యుద్ధం మూలంగా 1,600 మంది మా సైనికులు గాయడ్డారని తెలిపింది.. 217 యుద్ధం ట్యాంక్‌లను, 90 ఫిరంగులు, 31 హెలికాప్టర్లు ఉక్రెయిన్ ధ్వంసం చేసిందని పేర్కొన్న రష్యా.. 30 యుద్ధ విమానాలను కూడా ఉక్రెయిన్ కూల్చేసిందని తెలిపింది. ఈ యుద్ధంలో 498 మంది సైనికుల్ని కోల్పోయామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు 2,870 మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులను హతమార్చామని వెల్లడించింది..
Read Also: AP Inter Exams: పరీక్షల తేదీలు మారాయి..
