NTV Telugu Site icon

4 Year old Saves Mother’s Life: నాలుగేళ్ల బుడతడు.. తల్లి ప్రాణాలు నిలిపాడు..

Saves Mother

Saves Mother

నాలుగేళ్ల బాలుడు అంటే.. ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటాడు.. మారం చేస్తాడు.. అడిగింది తెచ్చి ఇవ్వాల్సిందే.. ఇలా ఇంట్లో సందడి చేస్తుంటాడు.. ఆ వయస్సులు వారి ఏమి చేసినా.. చూసేవారికి ముచ్చటగా అనిపిస్తోంది.. అయితే, ఇప్పుడు నాలుగేళ్ల లోపే బడిబాట పడుతున్నారు.. అది వేరే విషయం.. అయితే, ఓ బుడతడు.. తన తల్లి ప్రాణాలు పోకుండా కాపాడాడు.. తన తల్లి స్పృహతప్పి పడిపోతే.. ఆందోళన చెందకుండా.. సమయ స్ఫూర్తితో వ్యవహరించాడు.. ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేశాడు.. తన తల్లి పడిపోయిందని సమాచారం ఇచ్చి.. ఆమె ప్రాణాలు నిలిపి.. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు

Read Also: Amaravati Municipality: 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తస్మానియాకు చెందిన నాలుగేళ్ల బాలుడు.. స్పృహతప్పి పడిపోయిన తల్లిని చూసి అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమె ప్రాణాలను కాపాడాడు. చిన్న పిల్లవాడు దేశంలోని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి సహాయం కోరాడు. మంగళవారం ఫేస్‌బుక్‌లో అంబులెన్స్ టాస్మానియా షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, చిన్న పిల్లవాడి పేరు మాంటీ. ఆ బుడతడికి.. ఒక రోజు క్రితం ఎమర్జెన్సీ నంబర్ 000 (ట్రిపుల్ జీరో)కి డయల్ చేయడం గురించి నేర్పించారు పేరెంట్స్.. అదే ఎంతో ఉపయోగపడింది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. మూర్ఛ వచ్చి స్పృహతప్పి పడిపోయిన తల్లిని రక్షించడానికి కొత్తగా సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగించాడు.. అంబులెన్స్ టాస్మానియా కోసం ఫోన్ ఆపరేటర్‌కి “మమ్మీ పడిపోయింది” అని చెప్పాడు.. అంతేకాదు.. కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు.. తమ ఇంట్లో ఉన్న కుక్క మొరిగేదని, కానీ స్నేహపూర్వక పెంపుడు జంతువు అని వారికి తెలియజేసినట్లు ఫేస్‌బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇక, చిన్నాడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని.. అతడి తల్లి ప్రాణాలు కాపాడారు సిబ్బంది.. బుడతడు మాంటీకి ఏమి చేయాలో తెలుసునని, అతను అన్ని సూచనలను బాగా పాటించాడని.. ఆ ఘటన సమయంలో అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు అని.. వారి ఇంటికి వచ్చిన ఇద్దరు పారామెడిక్స్ ఆశ్చర్యపోయారు. మాంటీ తాను సూపర్ హీరోని కాదని ప్రజలకు చెబుతుంటాడు.. సూపర్‌హీరో కాదు, హీరో మాత్రమే అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక, నేను చాలా గర్వపడుతున్నాను, అతను నా చిన్న హీరో, అతను ఖచ్చితంగా నా ప్రాణాలు కాపాడాడు అని అతడి తల్లి ఆనందం వ్యక్తం చేసింది.. అయితే, ఆ బుడతడి తల్లి ఒక రిజిస్టర్డ్ నర్సు, మరియు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను అన్‌లాక్ చేయడం మరియు ట్రిపుల్ 0కి కాల్ చేయడం ఎలాగో మాంటీకి ఇప్పటికే నేర్పించారు.

పిల్లలకు అలా చేయడం చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను మరియు మీరు ఆందోళన చెందుతుంటే మీరు దీన్ని చేయాలని వారికి చెప్పండి.. అదే కొన్ని జీవితాలని కాపాడుతుందన్నారు.. ఇక, చిన్న పిల్లవాడికి అంబులెన్స్ టాస్మానియా ద్వారా అతని ధైర్యానికి సర్టిఫికేట్ లభించింది. ఫేస్‌బుక్ పోస్ట్‌కు వందలాది లైక్‌లు, షేర్లు, కామెంట్‌లు వచ్చాయి. చిన్న పిల్లవాడి ధైర్యాన్ని మరియు త్వరగా ఆలోచించే సామర్థ్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.. “ఇంత చిన్న ఛాంపియన్.. ఈ రాత్రి వార్తల్లో అతడిని చూశాను.. అతను నా హృదయాన్ని తాకాడు” అని ఒక నెటిజన్‌ కామెంట్‌ పెడితే.. “ఎంత అద్భుతంగా చేసారు మాంటీ మీరు ఖచ్చితంగా హీరో, ధైర్యవంతుడివి అంటూ మరొకరు ప్రశంసలు కురిపించారు.