NTV Telugu Site icon

US Maine Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి

Us Maine Shooting

Us Maine Shooting

4 shot dead in Maine home, 3 injured in linked highway shooting: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మైనే రాష్ట్రంలోని బౌడోయిన్‌ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరగ్గా.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆ తర్వాత 295వ నంబర్‌ హైవేపై కూడా పలు వాహనాలపై కాల్పులు జరగ్గా.. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెనువెంటనే రెండు చోట్ల జరిగిన ఈ కాల్పులకు సంబంధం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైవేలో కొంత భాగాన్ని గంటన్నర పాటు మూసివేశారు. ఎవరూ బయటకు రావొద్దని ప్రజల్ని ఆదేశించారు కూడా! కాసేపయ్యాక సామాన్యులకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చాక.. పోలీసులు ఆంక్షలు ఎత్తివేశారు.

UN On Taliban: తాలిబన్‌లను ఒప్పించలేకపోతే.. తప్పుకోవడానికి సిద్ధం

ఈ రెండు ఘటనలపై విచారణ చేపట్టిన పోలీసులు.. జోసెఫ్ ఈటన్ (34) అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బౌడోయిన్‌లోని ఓ ఇంటిలో నలుగురి మృతికి అతడే కారణమని అనుమానిస్తున్నారు. నిందితుడిని ఈ వారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే.. కాల్పులకు గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జానెట్‌ మిల్స్‌ స్పందిస్తూ.. ‘‘ఈ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రాన్ని కదిలించాయి. వీటి గురించి తెలియగానే నేను షాక్‌కు గురయ్యాను’’ అని ట్వీట్‌ చేశారు. అటు.. హైవేపై జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. తొలుత బౌడోయిన్‌లో కాల్పులు జరిగ్గా.. యర్‌మౌత్‌లోని ఇంటర్‌స్టేట్ 295లో దక్షిణాన 25 మైళ్ళ దూరంలో కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Fake IAS Officer: ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!

Show comments