US Maine Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 shot dead in Maine home, 3 injured in linked highway shooting: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మైనే రాష్ట్రంలోని బౌడోయిన్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరగ్గా.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆ తర్వాత 295వ నంబర్ హైవేపై కూడా పలు వాహనాలపై కాల్పులు జరగ్గా.. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెనువెంటనే రెండు చోట్ల జరిగిన ఈ కాల్పులకు సంబంధం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైవేలో కొంత భాగాన్ని గంటన్నర పాటు మూసివేశారు. ఎవరూ బయటకు రావొద్దని ప్రజల్ని ఆదేశించారు కూడా! కాసేపయ్యాక సామాన్యులకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చాక.. పోలీసులు ఆంక్షలు ఎత్తివేశారు.
UN On Taliban: తాలిబన్‌లను ఒప్పించలేకపోతే.. తప్పుకోవడానికి సిద్ధం
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఈ రెండు ఘటనలపై విచారణ చేపట్టిన పోలీసులు.. జోసెఫ్ ఈటన్ (34) అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బౌడోయిన్‌లోని ఓ ఇంటిలో నలుగురి మృతికి అతడే కారణమని అనుమానిస్తున్నారు. నిందితుడిని ఈ వారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే.. కాల్పులకు గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జానెట్ మిల్స్ స్పందిస్తూ.. ‘‘ఈ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్రాన్ని కదిలించాయి. వీటి గురించి తెలియగానే నేను షాక్‌కు గురయ్యాను’’ అని ట్వీట్ చేశారు. అటు.. హైవేపై జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. తొలుత బౌడోయిన్‌లో కాల్పులు జరిగ్గా.. యర్‌మౌత్‌లోని ఇంటర్‌స్టేట్ 295లో దక్షిణాన 25 మైళ్ళ దూరంలో కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Fake IAS Officer: ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!