NTV Telugu Site icon

Balochistan Bomb Blast: బలూచిస్తాన్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 18 మందికి గాయాలు

Balochistan Bomb Blast

Balochistan Bomb Blast

4 Killed And 15 Injured In Bomb Blast In Pakistan Quetta: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనేక ఇస్లామిస్ట్ సాయుధ గ్రూపులకు నిలయమైన బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నగరంలోని షహ్రాహ్‌-ఏ-ఇక్బాల్‌లో.. ఖాందారీ బజార్‌ దగ్గర నిలిపి ఉన్న పోలీసు వాహనం సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ పేలుడు సంభవించినట్లు ఎస్‌ఎస్‌పీ ఆపరేషన్స్‌ కెప్టెన్‌ జొహెయిబ్‌ మొహసిన్‌ తెలిపారు.

Extramarital Affair: భార్య కిరాతకం.. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి..

దుండగులు ద్విచక్ర వాహనంలో పేలుడు పదార్థాలను ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారి అజ్ఫర్ మెహసర్ వివరించారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు, ఇద్దరు పౌరులు మరణించారని పేర్కొన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. మరణించిన ఆ ఇద్దరు పౌరుల్లో ఒక ఐదు సంవత్సరాల బాలిక ఉంది. ఈ బాంబు పేలుడు తీవ్రత కారణంగా.. సమీపంలో ఉన్న కొన్ని ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో.. 18 మంది తీవ్ర గాయాలపాలయ్యాయని, గాయపడిన వారిలో మహిళతో పాటు పిల్లలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

US Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు దుర్మరణం

ఈ దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అనే వేర్పాటువాద గ్రూపు బాధ్యత వహించింది. విచారణ పేరుతో బలూచిస్తాన్ పౌరుల పట్ల అమానవీయంగా ప్రవర్తించినందుకే తాము ఈ దాడికి పాల్పడ్డాడమని, ఈ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారని ఆ గ్రూపు పేర్కొంది. అయితే.. తమ ప్రకటనలో ఆ గ్రూపు పౌర మరణాల గురించి ప్రస్తావించలేదు. కాగా.. ఈ మిలిటెంట్లు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తమకు భారీ వాటా ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు తెహ్రీక్-ఇ-తాలిబాన్ అనే పాకిస్తానీ తాలిబన్లతోనూ పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా పోరాడుతోంది.