Site icon NTV Telugu

Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి

Congo Video

Congo Video

ఆగ్నేయ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాగి మైనింగ్ గనిలో వంతెన కూలి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: IND vs PAK: టోర్నీలో తొలి పరాజయం.. పాక్ చేతిలో టీమిండియా ఓటమి..!

కాంగోలో ఎక్కువగా జీవనోపాధి మైనింగే. దీని మీదే ఆధారపడి జీవిస్తుంటారు. ఎక్కువగా మైనర్లు పని చేస్తుంటారు. అయితే ఈ మైనింగ్ పనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. భూగర్భంలో లోతుగా తవ్వడం వల్ల ప్రాణాంతక సంఘటనలు జరుగుతుంటాయి. శనివారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక్కసారి మైనింగ్‌కు సంబంధించిన వంతెన కూలిపోయింది. దీంతో 32 మంది చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Ai Courses: ఉచిత AI కోర్సులను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే

వంతెన కూలన ఘటనలో 32 మంది చనిపోయారని ప్రాంతీయ అంతర్గత మంత్రి రాయ్ కౌంబా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని.. అధికారులు మరణాల సంఖ్యను లెక్కిస్తున్నారని చెప్పారు. మైనర్లంతా ఒక్క దగ్గర గుమిగూడి ఉండడంతో మరణాలు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్య మైనర్లు-సైనికుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలు అందుతున్నాయి.

 

Exit mobile version