Site icon NTV Telugu

ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్‌ల అరాచ‌కం…మూత‌ప‌డుతున్న మీడియా సంస్థ‌లు…

ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన తరువాత అనేక మీడియా సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఆఫ్ఘ‌నిస్తాన్ లో మొత్తం 34 ప్రావిన్సులుంటే ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 33ప్రావిన్సుల్లోని 318 మీడియా సంస్థ‌లు మూత‌ప‌డిన‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ జ‌ర్న‌లిస్ట్ స్ప‌ష్టం చేసింది. మొత్తం 33 ప్రావిన్స్‌ల‌లోని 51 టీవీ ఛాన‌ళ్లు, 132 రేడియో స్టేష‌న్లు, 49 ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు మూసివేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ ముందు వ‌ర‌కు దేశంలో 114 పేప‌ర్స్ ఉంటే, తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల త‌రువాత కేవ‌లం 20 మాత్ర‌మే ఉన్నాయి. ఐఎఫ్‌జే నివేదిక ప్ర‌కారం ఆఫ్ఘ‌న్‌లో 5063 మంది జ‌ర్న‌లిస్టులు ఉండ‌గా ఆ సంఖ్య ఇప్పుడు 2334కి చేరింది. మీడియా ఛాన‌ళ్లు, ప‌త్రిక‌లు మూసివేయ‌డంతో ఉద్యోగాలు కోల్పోయారు. 72 శాతం మంది మ‌హిళా ఉద్యోగులు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయారు. తాలిబ‌న్ల పాల‌న‌లో ఉన్న కొద్ది మీడియా కూడా దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌క‌పోతే మీడియా మొత్తం మూత‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Read: పుతిన్ కావాల‌నే అలా చేశాడా లేక‌…?

Exit mobile version