Site icon NTV Telugu

Hijab Protest In Iran: హిజాబ్‌ వివాదం.. 17 నగరాల్లో కొనసాగుతున్న ఆందోళన.. 31 మంది మృతి

Hijab Protest In Iran

Hijab Protest In Iran

Hijab Protest In Iran:ఇరాన్‌లో దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. హిజాబ్‌ సరిగా ధరించలేదని మహ్స అమిని అనే మహిళను మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గత శుక్రవారం ఆమె మృతి చెందిందింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, యువత హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా రాజధాని టెహ్రాన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా చేస్తున్న అల్లర్లలో ఇప్పటివరకు సుమారు 31 మంది మృతిచెందినట్లు సమాచారం.. ఇందులో ఆందోళన కారులతోపాటు పోలీసులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్‌ అమలవుతున్న చట్టాలు, పోలీసుల జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్‌ సమా 17 నగరాల్లో ఆందోళన కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఆరురోజులుగా నిరసనలు పెరుగుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు బ్లాక్ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ తో సహ ఇటీవల కాలంలో మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన తర్వాత ఇరాన్ ప్రజలు వాట్సాప్, ఇన్ స్టాను ఎక్కువగా వాడుతున్నారు. అయితే నిరసనలు మరింత పెరగకుండా ప్రభుత్వం సోషల్ మీడియాను బ్లాక్ చేసింది. గతవారం మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో రాజధాని టెహ్రాన్ లో పర్యటిస్తున్న సమయంలో హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ.. శుక్రవారం మరణించింది. ఆమె మరణంతో ఇరాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు పెరిగాయి.
Errabelli Dayakar Rao: బతుకమ్మ చీరలను కాల్చితే కఠిన చర్యలు

Exit mobile version