సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్‌లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు వైద్య వర్గాలు శనివారం తెలిపాయి. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌పై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూప్ ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అత్యవసర సేవలు అందిస్తున్న కేంద్రం ధ్వంసమైందని వైద్యవర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: India vs England 2nd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..