Mine Collapse: ఆఫ్రికా దేశం జాంబియాలో గని ప్రమాదం జరిగింది. అక్రమంగా ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు పేరుగాంచిన జాంబియాలో రాగి గని కుప్పకూలడంతో 30 మంది అందులోనే చిక్కుకుపోయినట్లు ఆ దేశ మంత్రి శుక్రవారం తెలిపారు. చింగోలాలోని ఈ ప్రమాదం జరిగినట్లు హోం వ్యవహరాల మంత్రి జాక్‌మ్వింబు పార్లమెంట్‌లో తెలిపారు.
Read Also: Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది .. ప్రభాస్ బీభత్సమే
అయితే గని కూలడంతో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని వెల్లడించారు. అయితే మరణాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజధాని లుసాకాకు ఉత్తరాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింగోలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జాంబియా ప్రపంచంలోని అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది. చింగోలా జాంబియాలో అతిపెద్ద కాపర్ నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ రాగి గనులలో ఒకటి.
