Bus Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామీణ గుయిజౌ ప్రావిన్స్‌లోని సంధూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. నైరుతి చైనాలో ఆదివారం జరిగిన ఈ బస్సు ప్రమాదంలో 27 మంది మరణించారని, ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమని పోలీసులు తెలిపారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. సంధూ ప్రావిన్స్ రాజధాని గ్వియాంగ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని చెప్పారు.
Woman Safely Delivers: అర్ధరాత్రి నడిరోడ్డుపై బిడ్డకు పురుడు పోసిన మహిళా హెడ్ కానిస్టేబుల్
ఈ ఏడాదిలో చైనాలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం పర్వత ప్రాంతంగా పేరొందింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 02.40 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు చైనా రోడ్ నెట్ వర్క్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను త్వరాత డిలీట్ చేశారు. మరోవైపు గుయిజౌ ప్రావిన్స్‌లో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాకపోకలను నిషేధించారు. జూన్‌లో గుయిజౌ ప్రావిన్స్‌లో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో డ్రైవర్ మరణించాడు. మార్చిలో ఒక చైనీస్ ప్యాసింజర్ జెట్ క్రాష్ విమానంలో ఉన్న మొత్తం 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దశాబ్దాలుగా చైనాలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాన్ని సూచిస్తుంది.