Site icon NTV Telugu

Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Delta Airlines

Delta Airlines

డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులకు గురైంది. దీంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే భారీ కుదుపులు కారణంగా 25 మంది ప్రయాణికులు ఆస్పత్రి పాలయ్యారు. ఇక సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Malegaon Blast Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

బుధవారం.. సాల్ట్ లేక్ సిటీ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం బయల్దేరింది. విమానంలో 275 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారని ఎయిర్‌లైన్ తెలిపింది. అయితే గగనతలంలో ఉండగా ఒక్కసారిగా విమానం అల్లకల్లోలానికి గురైంది. కుదుపులు కారణంగా ఇరవై ఐదు మంది ఆసుపత్రి పాలయ్యారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. బుధవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందని పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది, పారామెడికిల్స్ సిబ్బంది ప్రాథమిక వైద్య సహాయం అందించారని మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్ట్స్ కమిషన్ తెలిపింది. అయితే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Supreme Court: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Exit mobile version