NTV Telugu Site icon

France Elections 2024: హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు.. డైలమాలో మాక్రాన్..!

French

French

France Elections 2024: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రోన్ పార్టీకి అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ రాలేదు.. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. తుది ఫలితాల వచ్చే వరకు వేచి చూసిన తర్వాత తుది నిర్ణయం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తీసుకుంటారని ఎలీసీ ప్యాలెస్ ప్రకటించింది. మరోవైపు, ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియెల్ అట్టల్ తన పదవికి రిజైన్ చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు.

Read Also: Heart Attack : పాఠశాలలో ఒక్కసారిగా కూలబడిపోయిన విద్యార్థి.. వైరల్ వీడియో..

కాగా, ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీ రాలేదు.. 577 స్థానాలున్న ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 289 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే, ఈ ఎన్నికల్లో అనూహ్యరీతిలో లెప్ట్ పార్టీలు పుంజుకున్నాయి. ఇవాళ (సోమవారం) ఉదయానికి వెలువడిన ఫలితాల ప్రకారం వామపక్ష కూటమి 180 సీట్లు గెలిచింది. మాక్రాన్‌ కూటమి 160 స్థానాలతో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. అతి మితవాద కూటమి 140 స్థానాల్లో విజయంతో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఈసారి అతి మితవాద పక్షాలతో కలిసి పాలన కొనసాగించడం అనివార్యమయ్యేలా కనిపిస్తుంది. ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి హంగ్ తప్పేలా లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది.

Read Also: Indonesia : ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ప్రకృతి బీభత్సం.. 11మంది మృతి

అయితే, ఫ్రాన్స్ లో ఒకవేళ హంగ్ వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడితే యూరోపిన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్‌ లో యుద్ధం, ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు, ఐరోపా ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఆధారంగా జాతీయ అసెంబ్లీని ఏ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది.. ప్రధాన మంత్రి పగ్గాలు ఎవరికి దక్కుతాయనేవి తేలనున్నాయి. ఫ్రాన్స్ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ వెల్లడించిన నేపథ్యంలో పారిస్, ఇతర నగరాల్లో ఆదివారం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పారిస్ వీధుల్లో మాస్కులు ధరించిన ఆందోళనకారులు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్యారెస్ ప్లేస్ డిలా రిపబ్లిక్ దగ్గర వేలాది మంది గుమిగూడడంతో హింస చెలరేగింది.