19 killed And 32 injured in fuel tanker tunnel blast in Kabul: ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక టన్నెల్ నుంచి వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్.. నిప్పంటుచుకొని పేలిపోవడంతో, 19 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక మిగతావాళ్లందరూ మగవారేనని, మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా ఉందని అన్నారు. మరో 32 మందికి ఈ ఘటనలో గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాబుల్‌కు ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ‘సలాంగ్’ అనే టన్నెల్ ఉంది. 1960లో దీని నిర్మాణం ప్రారంభించగా.. 1964లో ఇది పూర్తయ్యింది. ఉత్తర, దక్షిణానికి మధ్య వారధిగా ఉంటోన్న ఈ టన్నెల్‌లోనే ఈ దుర్ఘటన జరిగింది.
Thai Warship Sinks: నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు
అయితే.. ఆ ట్యాంకర్‌కు నిప్పు ఎలా అంటుకుంది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పర్వాన్ ప్రావిన్స్ స్పోక్స్‌మ్యాన్ హిమాతుల్లా షమీమ్ మాట్లాడుతూ.. ‘‘శనివారం రాత్రి టన్నెల్‌లో ఈ భారీ పేలుడు సంభవించింది. ఇందులో 19 మంది దుర్మరణం చెందారు. శిథిలాల్లో ఇంకా చాలామంది చిక్కుకున్నారు. చూస్తుంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ స్పోక్స్‌పర్సన్ మోల్వీ హిమాదుల్లా మిస్బా మాట్లాడుతూ.. ఆదివారం మంటలు ఆర్పివేయబడ్డాయని, ఎమెర్జెన్సీ బృందం ఇంకా ఈ టన్నెల్‌ని క్లీన్ చేసే పనిలో నిమగ్నమైందని పేర్కొన్నారు.
Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్‌కి పండగే!