NTV Telugu Site icon

UK: పీరియడ్స్ నొప్పి.. భరించలేక గర్భనిరోధక మాత్రలు.. 16 ఏళ్ల బాలిక బ్రెయిన్ డెడ్

Uk Girl After Taking Contra

Uk Girl After Taking Contra

నెలసరి వల్ల వచ్చే నొప్పి భరించలేక ఓ బాలిక గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. ఆ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె చివరకు బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూసింది. అత్యంత విషాదకర ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టెలిగ్రాఫ్‌ నివేదిక ప్రకారం.. యూకేకు చెందిన లైలా ఖాన్ (16) కొద్ది నెలల క్రితం విపరీతమైన పీరియడ్స్ నొప్పితో బాధపడింది. తన బాధను స్నేహితులతో పంచుకోగా గర్భనిరోధక మాత్రలు తీసుకోమ్మని సూచించారు. స్నేహితుల సలహా మేరకు ఆమె నవంబర్ 15 నుంచి గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) తీసుకోవడం ప్రారంభించింది.

Also Read: KTR Tweet: కేటీఆర్ కామెంట్స్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ అటాక్

మాత్రలు తీసుకున్న 10 రోజులకే లైలా తీవ్ర అస్వస్థతకు గురైంది. తరచూ వాంతులు చేసుకోవడం, తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరిక్షించిన వైద్యులు కడుపులో ఫుడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ అయ్యింటుందని అనుమానించి దాని తగిన ట్రీట్‌మెంట్ చేసి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగు కాకపోతే మళ్లీ ఆసుపత్రికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అదే రోజు రాత్రి లైలా ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంతి చేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లిన బాలిక అక్కడే కుప్పకూలిపోయింది.

Also Read: Japan: జపాన్ విప్లమాత్మక ప్రయోగం.. ఆవు పేడతో స్సేస్ రాకెట్ ఇంజన్ సక్సెస్

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిట్‌కు తరలించారు. వైద్యులు ఆమెకు సీటీ స్కాన్ నిర్వహించి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్టు చెప్పారు. డిసెంబర్ 13న ఆమెకు ఆపరేషన్ నిర్వహించి వైద్యులు భయపడాల్సిందేమి లేదని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ శస్త్ర చికిత్స జరిగిన రెండో రోజుకే లైలా మరణించింది. ఆమెది బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. క్రిస్మస్ పండుగ వేళ లైలా మరణం ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇంత దుఃఖంలోనూ లైలా కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయినా తమ కూతురి అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు మరికొందరికి ప్రాణం పోశారు.