Site icon NTV Telugu

Gunfire: అమెరికాలో మళ్లీ కాల్పులు.. 12 మందికి గాయాలు..

Shooting

Shooting

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.. కొలంబియా పోలీస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రం కొలంబియా సిటీలోని ఓ షాపింగ్‌ మాల్‌లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.. అయితే, ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, అయితే మొత్తం 12 మందికి గాయాలయ్యాయని.. బాధితుల వయస్సు 15 మరియు 75 మధ్య ఉంటుందని.. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులకు సంబంధించి తుపాకీలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొలంబియా పోలీస్ చీఫ్ హోల్‌బ్రూక్ తెలిపారు.. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా కాల్పులు జరిపిఉంటారని చెబుతున్నారు. ఇది యాధృచ్చికంగా జరిగిన ఘటనగా మేం భావించడం లేదు.. అదుపులోకి తీసుకున్న ముగ్గురి మధ్య ఏదో వ్యవహారం కాల్పులకు దారితీసినట్టుగా మేం నమ్ముతున్నాం అన్నారు.

Read Also: Street Fight: హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో స్ట్రీట్‌ ఫైట్‌..! ఒకరు మృతి..

Exit mobile version