Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ కల్లోలం.. అక్కడ 12 మంది మృతి..

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పెద్దగా ముప్పు లేదనే అంచనాలున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది.. డెత్‌ రేట్‌ చాలా తక్కువంటూ ప్రచారం సాగింది.. కానీ, ఒమిక్రాన్‌ బారినపడి ఏకంగా 12 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించింది బ్రిటన్‌.. యూకేలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని ఇవాళ వెల్లడించిన బ్రిటన్‌ ఉప ప్రధానమంత్రి డొమినిక్‌ రాబ్.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 మంది ఒమిక్రాన్‌ బాధితులు ప్రాణాలు విడిచారని తెలిపారు.

Read Also: సినిమా టికెట్ల ధరలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 62 వేలు దాటాయి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు.. బ్రిటన్‌లో నిన్న ఒకే రోజు 10 వేల ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.. ఇక, భారత్‌లో 167కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు, కర్ణాటకలో కొత్తగా 5 కేసులు బయటపడగా.. కేరళలో 4 కేసులు.. ఢిల్లీలో 6 పాజిటివ్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, డెత్‌ రేట్‌ తక్కువనే అంచనాలు ఇప్పటి వరకు ఉన్నా.. యూకేలో క్రమంగా ఒమిక్రాన్‌ బాధితుల మృతుల సంఖ్య పెరుగుతుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.

Exit mobile version