Site icon NTV Telugu

అంతకాలం జీవించడానికి కోడి మెదడే కారణమట…!!

కరోనా కాలంలో మనిషి ఎంత కాలం జీవిస్తాడో చెప్పలేని పరిస్థితి. కరోనా కంటే ముందు ఎంతకాలం జీవిస్తారో చెప్పగలిగే వారు.  కానీ, కరోనా సమయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు.  అయితే, ఓ పెద్దాయన ఇప్పటికే వందేళ్లకు పైగా జీవించాడు.  ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు.  తాను ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం కోడి మెదడు అని చెప్తున్నాడు.  తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కోడి మెదడును ఆహారంలో తీసుకుంటున్నానని అదే తన ఆరోగ్య రహస్యం అని చెప్తున్నాడు డెక్స్ టర్ క్రూగర్.  ఆస్ట్రేలియా లోని క్వీన్స్ ల్యాండ్ లో జీవించే ఈ పెద్దాయన ఓ పశువుల ఫారం ను నిర్వహిస్తున్నాడు.  ప్రస్తుతం అతని వయసు 111 ఏళ్ల 124 రోజులు.  ఎలాగైనా మరో ఐదేళ్లపాటు జీవించి రికార్డ్ సాధించాలని అంటున్నాడు క్రూగర్.  

Exit mobile version