11-yr-old Chinese boy cycled 130 kms for almost 24 hrs: సాధారణం అమ్మ కొడితేనో, నాన్న తిడితేనో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లడం చూస్తుంటాం. కొందరు కావాలని కొద్ది సేపటి వరకు తల్లిదండ్రులకు కనిపించకుండా దాక్కుంటారు. ఇలాంటి ఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తునే ఉంటాం. ఇదిలా ఉంటే చైనాకు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం తన తల్లిపై కంప్లైంట్ చేయడాని ఏకంగా 130 కిలోమీటర్ల దూరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. తన తల్లి గురించి అమ్మమ్మకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు.
Read Also: Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. జెజియాంగ్ లోని మీజియాంగ్ కౌంటీలో ఉన్న తన అమ్మమ్మ ఇంటిని చేరుకోవడానికి ఆ బాలుడు 24 గంటల పాటు సైకిల్ తొక్కి 130 కిలోమీటర్లు ప్రయాణించాడు. దారి తెలుసుకునేందుకు రహదారిపై ఉన్న పేర్లపై ఆధారపడ్డాడు. అయితే చాలా సందర్భాల్లో సరైన మార్గం కనుక్కోలేక తప్పుడు మార్గంలో వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చీ సరైన మార్గాల్లో వెళ్తూ చివరకు అమ్మమ్మ ఇంటిని చేరుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బ్రెడ్, నీటితో పొట్ట నింపుకుని ముందుకు సాగాడు. అయితే చివరకు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పిల్లాడి అద్భుతమైన చర్యను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
బాలుడిని సమీపంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతడు చాలా దూరం ప్రయాణించడం వల్ల చాలా అలసిపోయారు. అతడి వద్ద నుంచి తల్లిదండ్రులు, అమ్మమ్మ వివరాలను సేకరించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడు. అసలు ఈ విషయాన్ని బాలుడి తల్లి నమ్మలేకపోయింది. అయితే బాలుడి తల్లికి అమ్మమ్మ ఎలాంటి బుద్ది చెప్పిందో తెలుసుకోవాలని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.