NTV Telugu Site icon

CRPS: “అత్యంత నొప్పి”తో బాధపడుతున్న బాలిక.. మనవాళి చరిత్రలోనే అరుదైన వ్యాధి..

Crps

Crps

CRPS: కాలు కదిపినా నొప్పే, కాలికి ఏదైనా వస్తువు మామూలుగా తాకినా చచ్చేంద బాధ, చివకు ఎవరైనా పట్టుకున్నా కూడా చెప్పలేనంత బాధ అనుభవిస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పదేళ్ల బాలిక. మానవాళి చరిత్రలోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. బాలిక కదిలినప్పుడు కూడా అత్యంత బాధకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఫిజీ దేశానికి కుటుంబంతో కలిసి సెలవుల్లో వెళ్లినప్పుడు బెల్లా మాసి కుడి పాదంపై పొక్కులను గమనించారు. ఆ తర్వాత నుంచి బాలిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె అత్యంత అరుదైన కాంప్లెక్స్ రిజనల్ పెయిన్ సిండ్రోమ్ (CRPS) తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. మానవాళికి తెలిసిన “అత్యంత బాధాకరమైన పరిస్థితి” అని పిలుస్తారు.

Read Also: Hijra’s Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం.. వసూళ్ల విషయంలో ఘర్షణ

బాలిక రోగ నిర్థారణ చేసినప్పటి నుంచి రోజూవారీ కార్యకలాపాలు చాలా ప్రభావితం అయ్యాయి. ఆమె బాల్యాన్ని ఈ వ్యాధి హరిస్తోంది. ప్రతీ రోజు బాలిక నరకం అనుభవిస్తోంది. విపరీతమైన నొప్పితో పోరాడుతోంది. నొప్పి కారణంగా బెల్లా తన కుడి పాదం నుంచి కాలి పై వరకు పూర్తిగా చైతన్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు బాలిక మంచానికే అంకితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె తిరగాలంటే వీల్ చైర్ దిక్కయింది.

CRPS అనేది అరుదైన మరియు నయం చేయలేని సిండ్రోమ్, ఇది దీర్ఘకాలికంగా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. షార్ప్ పెయిన్, మంట, విపరీతమైన నొప్పితో బెల్లా బాధపడుతోంది. నేను స్నానం చేయలేను, అని బెల్లా చెప్పింది. కనీసం టిష్యూతో కూడా నా కాలిని తాకినా తీవ్రమైన నొప్పి ఉంటుందని బాలిక చెబుతోంది. చిన్నాపాటి గాయాలు, శస్త్ర చికిత్స సమయంలో తరుచుగా సంభవించే అత్యంత అరుదైన పరిస్థితిని బెల్ల ఎదుర్కొంటోంది. 10 ఏళ్ల చిన్నారి కదలేకుండా ఉంది. కాలి నుంచి పై వరకు స్పర్శ, అనుభూతిని కోల్పోయింది. పాఠశాలకు హాజరవ్వడం, స్నేహితులతో ఆడుకోవడం, చివరకు ప్యాంటు ధరించడం కూడా బెల్లా వల్ల కాదు. అయితే బెల్లా తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వైద్యుల వల్ల కాకపోవడంతో అమెరికా వైద్యులను ఆశ్రయించారు.

Show comments