Site icon NTV Telugu

బడ్జెట్లో ఊరట.. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

నిర్మలమ్మ బడ్జెట్లో ఊరట కలిగించే అంశం ఏదైనా వుందంటే అది గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడమే అంటున్నారు. కమర్షియల్ గ్యాస్​ సిలిండర్ ఉపయోగించే వారికి కాస్త ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు. దీంతో దేశ రాజధానిలో రూ.2000కుపైగా ఉన్న ఈ సిలిండిర్​ ధర రూ.1907కు దిగొచ్చింది.

సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్​ ధర తరచూ పెరగడం వల్ల చిన్న వ్యాపారస్థులు, హెటల్స్, రెస్టారెంట్​ నిర్వాహకులపై భారం పెరుగుతూ వస్తోంది. టిఫిన్ ధరలు గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు వాపోతున్న వేళ కేంద్రం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.

https://ntvtelugu.com/finance-mnister-nirmala-sitharaman-budget-2022-23/

సామాన్యులు వాడే డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా తగ్గించాలని కోరుతున్నారు. ఇదిలా వుంటే విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరను రికార్డు స్థాయిలో 8.5శాతం పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో ఢిల్లీలో కిలో లీటర్​ ఏటీఎఫ్ ధర రూ. 6,743 పెరిగి 86,038కి పెరిగింది. ఏటీఎఫ్​ చరిత్రలో ఇదే అత్యధిక ధర అంటున్నారు.

Exit mobile version