NTV Telugu Site icon

మహిళలకు షాక్ ఇచ్చిన బంగారం..రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర… ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 44,000 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1500 పెరిగి రూ. 73,400 వద్ద కొనసాగుతోంది. గత మూడు రోజులుగా నిలకడగా ఉన్న వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి.