Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..

Gold Silver

Gold Silver

Gold and Silver Prices Today: హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా ఉంది. ఇది రూ.1,700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.1,860 తగ్గింది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోనూ తగ్గిన ధరలు
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,42,050గా, 24 క్యారెట్ల బంగారం రూ.1,54,950గా ఉంది. రెండు రకాల బంగారం ధరలు వరుసగా రూ.1,700, రూ.1,860 తగ్గాయి. ముంబై, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.1,41,900, 24 క్యారెట్ల బంగారం రూ.1,54,800గా ఉంది. ఈ రెండు నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గాయి.

* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,050.. 24 క్యారెట్ల ధర రూ.1,54,950.. కిలో వెండి ధర రూ. 2,50,000

* ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,900.. 24 క్యారెట్ల ధర రూ.1,54,800.. కిలో వెండి ధర రూ.2,50,000

* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,900.. 24 క్యారెట్ల ధర రూ.1,54,800… కిలో వెండి ధర రూ.2,50,000

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరం ధర రూ.1,41,900.. 24 క్యారెట్ల ధర రూ.1,54,800.. కిలో వెండి ధర రూ.2,54,900

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1.40 లక్షలు, 22 క్యారెట్ల బంగారం రూ.1.50 లక్షల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అయితే, ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 8 గంటల సమయానికి సంబంధించిన రేట్లు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డిమాండ్‌, సరఫరా వంటి అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరలు రోజులో ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలుదారులు నగలు లేదా బంగారం కొనుగోలు చేసే ముందు తాజా లైవ్ రేట్లను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది. పేర్కొన్న ధరలు మునుపటి రోజు క్లోజింగ్ రేట్ల ఆధారంగా ఉండగా, కొత్త రోజు ధరలు పెరుగుదల లేదా తగ్గుదలతో ప్రారంభం కావచ్చు.