అక్టోబర్ 5 రాశి ఫలాలు.. ఆ 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం..
మేషం..
ఈ రాశివారు చేసే ప్రతి పనిలోనూ తగిన గుర్తింపు లభిస్తుంది. కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని నమ్మకూడదు.. విందు వినోదాల్లో పాల్గొంటారు..
వృషభం..
ఈ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. సమయాన్ని అసలు వృధా చేయకూడదు. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.. ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి.. గుడ్ న్యూస్ లు వింటారు..
మిధునం..
కుటుంబ సభ్యుల మద్దతు బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ రాశి వారు చేసే ప్రతి పనిని చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తారు.. కొన్ని విషయాలు నిరాశను కలిగిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి..
కర్కాటకం..
ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు..
సింహం..
నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..
కన్య..
బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. జాగ్రత్త.. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.. దైవ దర్శనాలు చేస్తారు..
తుల..
ఈరోజు మొదలు పెట్టిన ఏ పనులైన నత్త నడకగా సాగుతాయి.. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.. శుభవార్తలు వింటారు..
వృశ్చికం..
విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి..
ధనుస్సు..
ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి..
మకరం..
ఈరోజు మొదలు పెట్టిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.. ఈరోజు ఏది మొదలు పెట్టినా మంచే జరుగుతుంది..
కుంభం..
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు..
మీనం..
ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.. బంధువులతో సంతోషంగా ఉంటారు..