Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!

  • నేటి రాశిఫలాలు ఇలా
  • ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే..
August Horoscope 2026

August Horoscope 2026

Saturday Horoscope: ప్రతి రోజూ ప్రారంభమయ్యే వేళ గ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారి జాతకాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. చేసే పనుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది, వృత్తి-ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి అనే అంశాలపై ఒక స్పష్టత ఉంటే రోజంతా సాఫీగా గడిచిపోతుంది. దైవబలం తోడైతే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. ఈ నేపథ్యంలో ఈనాటి రాశి ఫలితాలు మరియు దోష నివారణకు చేసుకోవాల్సిన పూజా వివరాలు రాశుల వారీగా చూసేయండి ఇలా..

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా సాగుతుంది. గత కొంతకాలంగా వేర్వేరు రూపాల్లో వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. రావలసిన పాత బాకీలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం శ్రేయస్కరం. విశేష ఫలితాల కోసం అష్టలక్ష్మీ స్తోత్రమును భక్తిశ్రద్ధలతో పారాయణం చేయాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి సంతానానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు అందుతాయి. అయితే ఆర్థిక పరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల కారణంగా శ్రమాధిక్యత ఉంటుంది. వీరికి శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకూలించే దైవం కాగా, జగన్నాథాష్టకమును పారాయణం చేయడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.

మిథున రాశి

మిథున రాశి వారు ప్రత్యేక శ్రద్ధతో మొదలుపెట్టిన పనుల్లో అనుకున్న విజయాలను సాధిస్తారు. వ్యవహారాలన్నీ దశలవారీగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మహాగణపతి అనుగ్రహం అవసరం కాబట్టి, రోజూ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయడం శుభప్రదం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఉద్యోగపరమైన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు; పనుల్లో క్రమశిక్షణ చాలా మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వారు మల్లికార్జున స్వామిని స్మరిస్తూ, శివార్చన నిర్వహించడం వల్ల కార్యానుకూలత చేకూరుతుంది.

సింహ రాశి

సింహ రాశి జాతకులు వృత్తి, ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి నూతన విధానాలను అవలంబించేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గతంలో ఎదురైన ఆర్థిక గందరగోళ పరిస్థితులను విజయవంతంగా అధిగమిస్తారు. ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేస్తూ, ఆదిత్య హృదయ స్తోత్రమును పారాయణం చేయడం ఉత్తమం.

కన్య రాశి

కన్య రాశి వారికి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు మరింతగా వృద్ధి చెందుతాయి. అవసరంలో ఉన్న ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. శ్రీ మహాకాళీ అమ్మవారి అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుంది. అమ్మవారి దయ కోసం కాళీ స్తోత్రమును పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి ప్రోత్సాహం మరియు అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక సంబంధిత అంశాలను చక్కదిద్దుకోగలుగుతారు. అయితే గతంలో తీసుకున్న అప్పుల విషయంలో రుణదాతల నుండి కొంత ఒత్తిడి మొదలయ్యే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణలో వచ్చే అవాంతరాలను అధిగమించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ, సత్యనారాయణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించడం వల్ల సమస్యలు సమసిపోతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఉద్యోగ మరియు వృత్తి పరంగా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఎంతో కీలకమైన సమాచారం అందుతుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు కలిగిన ప్రముఖులను కలుసుకుంటారు. సాంఘిక, ప్రజా సంక్షేమ సంబంధిత కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి రక్షగా నిలుస్తారు; పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రమును పారాయణం చేయడం విశేష ఫలితాలనిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు కుటుంబంలో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఊహించని ఆకస్మిక విజయాలు సొంతమవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఈ రోజు దైవానుగ్రహం మీకు ఎంతగానో తోడ్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం కార్తీకేయ స్తోత్రమును భక్తితో పారాయణం చేయడం శ్రేయస్కరం.

మకర రాశి

మకర రాశి వారు వృత్తి, ఉద్యోగ విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపారంలో సాధారణ, మిశ్రమ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వివిధ పనులను ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవడం మంచిది. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ రాశి వారికి నందీశ్వరుడు అనుకూలించే దైవం; సమీపంలోని శివాలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శనం చేసుకుని, అర్చన నిర్వహించడం వల్ల మేలు జరుగుతుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సహకారం అందుతాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబ పరంగా, సామాజికంగా గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. శ్రీ లలితా అమ్మవారి కటాక్షం కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అత్యంత శుభప్రదం.

మీన రాశి

మీన రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరి కాలం కలిసివస్తుంది. సన్నిహితులు, బంధువుల శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం. మహాగౌరీ అమ్మవారి అనుగ్రహం కోసం గిరిజా స్తోత్రమును పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.