Site icon NTV Telugu

Zodiac Signs Dussehra Lucky: 50 ఏళ్ల తర్వాత అరుదైన దసరా.. ఈ రాశుల వారికి మామూలుగా లేదంటా!

Dussehra 2025 Astrology

Dussehra 2025 Astrology

Zodiac Signs Dussehra Lucky: ఈ ఏడాది విజయదశమి పండుగ అనేక విధాలుగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. 50 ఏళ్ల తర్వాత అరుదైన దసరా పండుగ రాబోతుందని చెబుతున్నారు. ఇది అనేక రాశుల వారికి శుభప్రదం అవుతుందని, కొన్ని రాశులకు స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని అంటున్నారు. దసరా పర్వదినం ఈ రాశుల వారి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, విజయానికి కొత్త ద్వారాలు తెరుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది దసరా పండుగ ఏ రాశుల వారికి ఆనందాన్ని ఇస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Bombay High Court: హైకోర్టు సంచలన తీర్పు.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా.. పోక్సో కేసు రద్దు కాదు!

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఏడాది దసరాను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే పండుగ రోజున రవియోగం, సుకర్మయోగం, ధృతి యోగం ఏర్పడబోతున్నాయని చెబుతున్నారు. ఇవి ఏంటో చూద్దాం..

రవి యోగం: రవి యోగం అన్ని రకాల అశుభాలను నాశనం చేసి, అన్ని ప్రయత్నాలలో విజయాన్ని తెస్తుందని చెబుతున్నారు. ఈ యోగంలో చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి, గౌరవాన్ని పెంచుతాయని అంటున్నారు.

సుకర్మ యోగం: సుకర్మ యోగం చాలా శుభప్రదమైనదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగ సమయంలో ప్రారంభించిన పని అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని, ఇది అదృష్టాన్ని తెస్తుందని అంటున్నారు.

ధృతి యోగం: ధృతి యోగం స్థిరత్వం, సహనాన్ని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. ఈ యోగంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయని చెబుతున్నారు.

దసరా తర్వాత అక్టోబర్ 3న బుధుడు-కుజుడి సంయోగం జరగనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడు తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారాన్ని సూచిస్తాడు, కుజుడు శక్తి, ధైర్యం శౌర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం అనేక రాశులకు శుభ ఫలితాలను తెస్తుందని అంటున్నారు. ఈ అరుదైన సంయోగం ప్రముఖంగా కొన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుందని చెబుతున్నారు.

ఈ 4 రాశుల వారికి అంతా శుభాలే..

సింహ రాశి: సింహ రాశి వారికి ఈ కాలం శుభాలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. ఈ రాశి వారికి పనిలో ప్రశంసలు లభిస్తాయని, పదోన్నతి లేదా జీతం పెరుగుదల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయని చెబుతున్నారు. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. ఈ రాశి వారికి లాభదాయకమైన, శుభప్రదమైన ప్రయాణం జరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు పేర్కొన్నారు.

మేషరాశి: ఈ సమయం మేష రాశి వారికి ఒక వరం లాంటిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృత్తి, వ్యాపారం, పెండింగ్ పనులు పూర్తవుతాయని అంటున్నారు. ఈ రాశుల వారికి ఉన్నతాధికారులు, పనిలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని చెబుతున్నారు. వ్యాపారంలో గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వీరికి కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయని, ఇవి వారి ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ రాశివారికి ఉన్న మరో శుభం ఏమిటంటే వీళ్లు ఊహించని ఆర్థిక లాభాలను స్వీకరిస్తారని చెబుతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సంబంధాలలో మాధుర్యం లభిస్తుందని అంటున్నారు.

తులా రాశి: తులా రాశి వారికి ఈ దసరా యోగాలు చాలా ఫలవంతమైనవిగా ఉంటాయని చెబుతున్నారు. పండుగ సమయం ఈ రాశి వారి వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. పెట్టుబడులపై మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వైవాహిక సమస్యలు తొలగిపోతాయని, భాగస్వామ్య పనులు విజయవంతమవుతాయని పేర్కొన్నారు. ఈ రాశుల వారి కోరికలు నెరవేరవచ్చని, వాళ్లు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెబుతున్నారు.

మకర రాశి: మకర రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోందని చెబుతున్నారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎక్కడో చిక్కుకున్న డబ్బు తిరిగి పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఆస్తి లేదా వాహనం కొనడానికి ఇది మంచి సమయం అని చెబుతున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల వీళ్లకు భవిష్యత్తులో ఊహించని లాభాలు వస్తాయని చెబుతున్నారు. ఈ రాశుల వాళ్లకు సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయని అంటున్నారు. సామాజిక సేవలో వీళ్ల భాగస్వామ్యం పెరుగుతుందని, ఇది సమాజంలో వీళ్ల స్థాయిని పెంచుతుందని అంటున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ శుభ యోగాలు ఇతర రాశిచక్ర గుర్తులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయని, కానీ పైన పేర్కొన్న 4 రాశుల వాళ్లకు ముఖ్యంగా ప్రయోజనం అందుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

READ ALSO: NCRB 2023 Crime Report: NCRB సంచలన రిపోర్ట్‌.. నకిలీ కరెన్సీ దందా నుంచి మహిళలపై దాడుల వరకు ఏ రాష్ట్రం ఏ ప్లేస్‌లో ఉందో తెలుసా!

నోట్: ఈ వార్తలో ఇవ్వబడిన సమాచారం జ్యోతిషశాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.

Exit mobile version