Site icon NTV Telugu

Astrology: మార్చి 20, ఆదివారం దినఫలాలు

మేషం :- ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మున్ముందు సత్ఫలితాలు ఉంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

వృషభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.

మిథునం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. బాకీలు, ఇంటి అద్దెలు ఇతరత్రా రావలసిన ఆదాయం సకాలంలో అందుతాయి. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు.

కర్కాటకం :- మీ బలహీనతలు, మాటతీరు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు.

సింహం :- సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బ్యాంకు పనులు పూర్తికాక ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహరాలు వాయిదా పడే సూచనలున్నాయి. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు. ఆత్మీయుల కలయికతో స్త్రీలు మానసికంగా కుదుటపడతారు.

కన్య :- బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు తలెత్తగలవు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు యత్నాలు ఒక కొలిక్కిరాగలవు.

తుల :- విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు క్లయింట్లతో చికాకులు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి చూపుతారు.

వృశ్చికం :- విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు బంధు మిత్రుల విషయాలలో అతిగా వ్యవహరించటంవల్ల మాటపడక తప్పదు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం.

ధనస్సు :- ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టు ప్రక్కల వారి నుండి ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.

మకరం :- విదేశీ యత్నాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. స్త్రీలకు విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

కుంభం :- బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. ప్రముఖులతో సాన్నిత్యం పెంచుకుంటారు. అధికంగా శ్రమించి అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు.

మీనం :- ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు. ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. విదేశీ యత్నాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

Exit mobile version