Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Yoga: జ్యోతిష్యశాస్త్రంలో ‘శివ యోగానికి’ చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని అత్యంత ప్రాచీనమైన, శక్తివంతమైన శుభ యోగంగా పెద్దలు చెప్తారు. ఈ యోగం నడుస్తున్న సమయంలో ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది జూన్ 24, 2026 బుధవారం ఉదయం 10:23 గంటలకు ఈ శుభకరమైన శివ యోగం ప్రారంభం కానుంది. ఇది మరుసటి రోజు, అంటే జూన్ 25 ఉదయం 10:54 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతోంది. ఈ శివ యోగం వల్ల అపారమైన ప్రయోజనాలు పొందబోయే ఆ మూడు అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి
ఈ శుభదినాన ఏర్పడే శివ యోగం కారణంగా మిథున రాశి వారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరగడంతో పాటు ఉద్యోగం చేసే వారికి ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు కూడా గతంలో కంటే ఎంతో మెరుగవుతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే స్నేహితుల సహాయంతో చాలా తక్కువ పెట్టుబడితోనే ఒక విలువైన వస్తువును లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఇది భవిష్యత్తులో మీకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో మీరు మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు, అయితే ఆహారం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ శివ యోగం ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది. దీనివల్ల ధన సంపదలను సంపాదించడానికి మీకు అనేక కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవడంతో కుటుంబ అవసరాలన్నింటినీ సకాలంలో తీర్చగలుగుతారు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న కొత్త వాహనం కొనే అవకాశం ఈ సమయంలో లభిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడానికి లేదా చిన్నపాటి ట్రిప్స్ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ కాలంలో బయటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనులు, ఏవైనా అవసరమైన ప్రయత్నాలు ఈ కాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. వర్క్ ప్లేస్‌లో మీ కష్టానికి అందరి నుండి ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో మీకు దైవచింతన, పూజలు, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే అనవసరమైన గొడవలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చదువుకునే విద్యార్థులకు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే ప్రేమ జీవితం కూడా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. మీ రాశి మిథునం, వృశ్చికం లేదా ధనుస్సు అయితే జూన్ 24 నుండి మీ అదృష్ట సమయం మొదలైనట్టే లెక్క.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం అంతా జ్యోతిష్య శాస్త్ర నిబంధనలు, నమ్మకాలపై ఆధారపడి ఉన్నదే కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. పూర్తి వివరాల కోసం సంబంధిత జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!