అక్టోబర్ 4 బుధవారం రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే..
మేషం..
ఈరోజు పనుల్లో ఆటంకాలు.. ఏదైనా చేస్తే ఆచితూచి చెయ్యడం మంచిది.. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఉద్యోగ ఫలితాలు నిరాశను కలిగిస్తాయి.. శివుని నామస్మరణ చెయ్యడం మంచిది..
వృషభం..
మీరు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.. శుభవార్తలు వింటారు..
మిధునం..
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనఃశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభకరం.. ఈరోజు అనుకున్న పని పూర్తి చేస్తారు..
కర్కాటకం..
అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.. అనుకున్న పనులు జరుగుతాయి.. అదృష్టం బాగుంది..
సింహం..
మీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.. ఈరోజు మంచి రోజు..
కన్య..
పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. ఆరోగ్యవసమస్యలు..
తుల..
ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. పనులలో జాప్యం.. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి…
వృశ్చికం..
ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి.. మొదలు పెట్టిన పనులలో ఆటంకాలు.. ఉద్యోగ అవకాశాలు కలిసిరావు..
ధనస్సు..
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం.. ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి.. శుభవార్తలు వింటారు..
మకరం..
మీరు మొదలు పెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.. శివుణ్ణి ప్రార్దించాలి..
కుంభం…
కీలక విషయాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.. ముఖ్యమైన పనులను కుటుంబ సహకారంతో పూర్తి చేస్తారు.. కొన్ని వార్తలు సంతోషాన్ని కలిగిస్తుంది..
మీనం..
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. మొదలు పెట్టిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు.. మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. విందు వినోదాల్లో పాల్గొంటారు.. ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలి..