Chandra Grahan 2026 Rashifal: 2026లో మార్చి 3న తొలి ‘‘చంద్రగ్రహణం’’ ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సింహరాశి పూర్వఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తోంది. దాదాపుగా 3 గంటల 27 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.46 గంటలకు ముగుస్తుంది.
ఈ గ్రహణం భారత్‌తో సహా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణానికి జ్యోతిష్యపరంగా చాలా ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గ్రహ ప్రవేశాలు, కొత్త ప్రారంభాల వంటి శుభకార్యాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
అయితే, ముఖ్యంగా మూడు గ్రహాల వారికి ఈ గ్రహణం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహణం ప్రభావం వల్ల డబ్బు, ఆరోగ్యం, వృత్తికి సంబంధించిన విషయాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ప్రధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలని, సంఘర్షణలకు దూరంగా ఉండాలని, ధ్యానం, సానుకూల ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నారు.
సింహం:
ఈ గ్రహణం సింహరాశి వారికి కొంచెం సవాలుగా ఉంటుందని, వీరు అశాంతితో బాధపడొచ్చని, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పనిలో ఒత్తిడి పెరుగొచ్చు. ఉన్నతాధికారులతో విభేదాలు ఉండొచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కుటుంబంలో, వైవాహిక జీవితంలో కూడా ఉద్రిక్తత ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో తలనొప్పి, అలసట లేదా కంటి సమస్యలు ఆందోళన కలిగించవచ్చు.
వృశ్చిక రాశి:
ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఒత్తిడి ఎదురుకావచ్చు. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఇబ్బందులు, పనిలో, వ్యాపారంలో ఒడిదుడుకులు సంభవించవచ్చు. సహోద్యోగులతో విభేదాలు పెరగవచ్చు. శత్రువులు ఇబ్బందులకు గురిచేయవచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, సంబంధాలు దెబ్బతింటాయి. కడుపు సమస్యలు, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉండవచ్చు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈ కాలంలో మీన రాశి వారికి కొన్ని సమస్యలు,అడ్డంకులు రావచ్చు. పని సకాలంలో పూర్తి కాకపోవచ్చు , మీ కృషికి ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఖర్చులు పెరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా అనిపించవచ్చు. కుటుంబ ఉద్రిక్తతలు, ప్రియమైనవారితో విభేదాలు పెరగవచ్చు. మానసిక అస్థిరత , నిద్ర లేకపోవడం కూడా ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
