NTV Telugu Site icon

Holi 2025: హోలీకి , రాధాకృష్ణులకు సంబంధం ఏంటి?

Holi 2025

Holi 2025

సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాము. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పల్లెల నుంచి పట్టణాలదాకా ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న నుంచి పెద్దల దాకా అందరూ రంగులు పూసుకుంటూ.. చిందులేస్తుంటారు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేస్తారు. కాగా.. రేపే(శుక్రవారం) దేశ వ్యాప్తంగా ఈ సంబరాన్ని జరుపుకుంటారు. అయితే.. హోలీ పండుగకు, రాధాకృష్ణులకు సంబంధం ఉంది. పురాణాల ప్రకారం.. బృందావనంలో హోలీ మొదలైంది. అసలు కథేంటో పూర్తిగా తెలుసుకుందాం..

READ MORE: World Kidney Day 2025: అపోలో డయాలసిస్ క్లినిక్స్ అవగాహన కార్యక్రమాలతో ముందంజ..

పురాణాల ప్రకారం.. హోలీ అనేది కృష్ణుడు, రాధల మధ్య దైవిక ప్రేమకు గుర్తుగా చేసుకుంటారు. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉండేది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి.. అమ్మ రాధ శరీరం రంగు, నా శరీర రంగు పూర్తి విరుద్ధం కదా.. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా? అని ఆతృతగా అడిగాడు. యశోద వారి శరీర రంగులో తేడాను తొలగించేందుకు.. రాధ ముఖానికి రంగులు వేయమని శ్రీకృష్ణుడుని యశోద సరదాగా సూచించింది. కృష్ణుడు తన తల్లి సలహా మేరకు.. రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అది కాస్త బృందావనం మొత్తం పాకిపోయింది. అలా మొదట బృందావనంలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. అందుకే ఇప్పటికీ మధుర, బృందావన్‌లలో హోలీ పండుగను చాలా వైభవంగా ఆడతారు. ఇది పురాణాల్లో ఉన్న ఒక కథ మాత్రమే. హోలీతో ముడిపడి మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి.

READ MORE: Andhra Pradesh: ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం..!