బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్ తో అదరగొట్టారు. తన ఛార్మింగ్ లుక్ కు తగ్గట్టుగానే సెమీ ఫార్మల్ డ్రెస్ లో మరింత హ్యాండ్సమ్ గా కన్పించాడు. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కు హాజరైన మహేష్ బాబు పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. QuikOn అనే యాప్ లాంచ్ ఈవెంట్ కి మహేష్ అతిథిగా హాజరయ్యారు. కాగా మహేష్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీతో బిజీగా ఉన్న ఆయన నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ భారీ సినిమాలో భాగం కానున్నారు.
Mahesh Babu : సెమీ ఫార్మల్ లో ఛార్మింగ్ లుక్… సూపర్ స్టార్ పిక్స్ వైరల్
Show comments