ఈ మధ్య కొందరు మనుషులు రీల్స్ కోసమో తెలీదు. వేరే ఇంకోటి ఏంటో తెలియదు కానీ.. వైరల్ అయ్యేందుకు అడ్డమైన పనులు చేస్తున్నారు. వీటి వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న పిల్లవాడిని ఇంటి పైకప్పు నుంచి కిందకు విసిరేస్తుసిన వీడియో.. అందరిని ఒకింత.. ఆశ్చర్యానికి, భయానికి గురిచేసింది. ఇది ఏదైనా ఆచారంలో భాగమా లేదా ఆ మహిళ సరదా కోసం ఈ ప్రమాదకరమైన చర్య చేసిందా .. లేక రీల్స్ కోసం చేసిందా అనే విషయం తెలిలేదు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా షాక్ అవుతారు.
అయితే ఇక్కడ తల్లి పిల్లాడిని కిందకి ఎందుకు పడేసిందో తెలియదు. మరో వ్యక్తి మాత్రం పిల్లాడిని బంతిలాగా క్యాచ్ పట్టాడు. మరీ ఇలా ఎందుకు చేశారో తెలియక నెటిజన్లు తలలు పట్టుకుంటారు. ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో చాలా మంది మహిళలు పైకప్పుపై నిలబడి ఉన్నారు.. చాలా మంది పురుషులు కింద నిలబడి ఉన్నారు. మొదట మహిళలు రోడ్డుపై జరుగుతున్న ఊరేగింపును చూడటానికి నిలబడి ఉన్నట్లు అనిపించింది. కానీ అక్కడ ఒక మహిళ చేతిలో పిల్లవాడిని పట్టుకుని పైకప్పు అంచున ప్రమాదకరంగా వాలుతూ కనిపించింది..మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె ఆ చిన్న పిల్లవాడిని పైకప్పు నుంచి కిందకు విసిరేసింది. కింద నిలబడి ఉన్న వ్యక్తి ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు. అయితే ఆ పిల్లవాడిని కింద నిలబడిన వ్యక్తి పట్టుకోకుండా వదిలేస్తే పరిస్థితి ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి.. ఇలాంటి స్టంట్స్ చేసి.. ప్రజలను భయ, భ్రాంతులకు గురి చేయవద్దని.. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
