NTV Telugu Site icon

TTD Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీటీడీ లో భారీగా ఉద్యోగాలు.. రూ. లక్షన్నర జీతం..

Ttd Jobs

Ttd Jobs

టీటీడీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఏపీ ప్రభుత్వం టీటీడీ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఏపీకి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత,ఎంపిక ప్రక్రియ,శాలరీ వంటి తదితర వివరాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.. మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 56

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు

అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు..

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి..

వయస్సు..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు..

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం..

ఏఈఈ పోస్టులకి నెలకు రూ.57,100-1,47,760.. ఏఈ పోస్టులకి రూ.48,440-1,37,220.. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500గా ఉంటుంది.

ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org/ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అప్లై చేసుకొనే ముందు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..