NTV Telugu Site icon

TSGENCO Notification 2023: బీటెక్‌ అర్హతతో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు..పూర్తి వివరాలు..

Tsgenco Ae Notification 2023

Tsgenco Ae Notification 2023

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. పూర్తి వివరాలు..

పోస్టుల వివరాలు..

రిక్రూట్‌మెంట్‌-145 పోస్ట్‌లు, లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌- 42 పోస్ట్‌లు.
అసిస్టెంట్‌ ఇంజనీర్‌(మెకానికల్‌)-జనరల్‌ రిక్రూట్‌మెంట్‌-74 పోస్ట్‌లు; లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌-3 పోస్ట్‌లు.
అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌)-జనరల్‌ రిక్రూట్‌మెంట్‌-25 పోస్ట్‌లు.
అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌)-జనరల్‌ రిక్రూట్‌మెంట్‌-1,లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌-49 పోస్ట్‌లు
నాలుగు బ్రాంచ్‌లకు సంబంధించి లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ పరిధిలో 94 పోస్ట్‌లు, జనరల్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 245 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి..

అర్హతలు..

ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. n ఏఈ(మెకానికల్‌): మెకానికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ)/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ పవర్‌/పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి..

వయసు..

జూలై 1, 2023 నాటికి 18-44 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ / ఎస్‌టీ/ ఓబీసీ(నాన్‌ -క్రీమీలేయర్‌)/ఈ డబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇస్తారు.

వేతనం..

తుది విజేతల జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకుంటే.. రూ.65,600-రూ.1,31,220 వేతన శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.

ఎలా అప్లై చేసుకోవాలంటే?

పరీక్షలో మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్లు, లోకల్‌ కేడర్‌ తదితర నిబంధనలను అనుసరించి తుది జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు. ఆ క్రమంలో ఆయా కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కుల నిబంధనను అమలు చేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, క్రీడాకారుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు; బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; పీహెచ్‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2023
రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌ 3, 2023
రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో.

ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కొరకు అధికార వెబ్‌సైట్‌: https://tsgenco.co.in/ పరిశీలించాలి..