Site icon NTV Telugu

TGEAPCET-2025: టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు.. చెక్ చేసుకోండిలా..

Tgeapcet

Tgeapcet

టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కౌన్సిలింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మొత్తం 172 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా 77,561 సీట్లు కేటాయించారు. మొత్తం 5,493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆప్షన్లు ఇచ్చినప్పటికీ 16,793 అభ్యర్థులకు సీటు లభించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 6,083 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. 100% ప్రవేశాలు పొందిన కాలేజీల సంఖ్య 82.. కాగా వీటిలో 6 యూనివర్సిటీలు, 76 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

READ MORE: Bombay High Court: భర్తతో సె*క్స్‌కు నిరాకరించినా భార్యకు విడాకులు ఇవ్వొచ్చు..

Exit mobile version