NTV Telugu Site icon

Telangana Medical Jobs : 1,800 నర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు..

Telangana Jobs

Telangana Jobs

తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి 1,800 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తొలి సంతకం చేశారు… త్వరలోనే నర్సింగ్ విద్యార్థుల కోసం 1800 పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చెయ్యాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు..

అలాగే రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టింది.ఇందులో భాగంగా 5,204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. సుమారు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, రాత పరీక్ష నిర్వహించి ‘కీ’ని కూడా విడుదల చేశారు.. దానికి కూడా వెంటనే నియామకాలను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు..

అదే విధంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,996 మంది ANM ల నియామకానికి ఆగస్టులో ప్రకటన వెలువడగా దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది.. అయితే నవంబర్ 10 న పరీక్షలు నిర్వహించాలి.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.. ఆ తర్వాత ఎన్నికలు రావడం వల్ల ఈ ఉద్యోగాల గురించి పక్కన పెట్టేశారు..ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియకు ఆగస్టులో ప్రకటన వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. తదుపరి నియామక ప్రక్రియ నిల్చిపోయింది… వీటిన్నటికీ తర్వాత ఎప్పుడు ప్రకటన చేస్తారు అంటూ విద్యార్థులు కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై ఎప్పుడు కొత్త సర్కార్ క్లారిటీ ఇస్తారో చూడాలి..