NTV Telugu Site icon

Study in Germany: నాన్‌-ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ కంట్రీ జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలు

Study In Germany

Study In Germany

Study in Germany: ఐఎంఎఫ్‌ఎస్‌.. విద్యార్థులకు ఎలాంటి సర్వీసులు అందిస్తోంది?. ఈ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మరీ ముఖ్యంగా జర్మనీలో స్థిరపడాలనుకునేవారికి ఎలాంటి ఆపర్చునిటీస్‌ అందుబాటులో ఉన్నాయి?. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఎన్‌-కెరీర్‌’.. ఓవర్సీస్‌ స్టడీస్‌లో పేరుగాంచిన వ్యక్తి, ఐఎంఎఫ్‌ఎస్‌ సీఈఓ కేపీ సింగ్‌, డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ వేములపాటి, anhalt రిప్రజెంటేటివ్‌ లిండాను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా ఐఎంఎఫ్‌ఎస్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ వేములపాటి మాట్లాడుతూ ఈ సంస్థను సీఈఓ కేపీ సింగ్‌ 1997లో బాంబేలో ప్రారంభించినట్లు చెప్పారు. నలుగురు విద్యార్థులతో చిన్న కారు గ్యారేజంత ప్రదేశంలో మొదలై పాతికేళ్లకు పైగా విజయవంతంగా, నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. ‘‘రెండేళ్ల కిందటే బాంబే, పుణే, హైదరాబాద్‌, వడోదర, మణిపాల్‌, బెంగళూర్‌ తదితర సిటీల్లోని 10 సెంటర్లకు విస్తరించింది.

ఏటా 4 వేల నుంచి నాలుగున్నర వేల మంది వరకు విద్యార్థులను ప్రపంచంలోని వివిధ బెస్ట్‌ యూనివర్సిటీలకు పంపిస్తోంది. ఇప్పటివరకు 50 వేల మంది విద్యార్థులను అబ్రాడ్‌కి పంపించిన ఘనత ఐఎంఎఫ్‌ఎస్‌కి మాత్రమే సొంతం. మొదట్లో అగ్రరాజ్యం అమెరికాకే స్టూడెంట్స్‌ని పంపించేవాళ్లం. ఇప్పుడు ఆ దేశంతోపాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ వంటి దేశాలకూ వెళుతున్నారు. ఇవన్నీ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ కంట్రీస్‌. కానీ నాన్‌- ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ కంట్రీ జర్మనీకి కూడా మేం ఎక్కువ మంది విద్యార్థులను ఎంకరేజ్‌ చేస్తున్నాం. అక్కడా విద్య, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. జర్మనీలో నాణ్యమైన విద్య చౌకగా లభించటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి.

అక్కడే చదువుకొని, ఉద్యోగం చేసుకుంటూ, సెటిల్‌ అయ్యేందుకు ఛాన్సెస్‌ ఉన్నాయి. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆ దేశాన్ని తమ గమ్య స్థానంగా ఎంచుకుంటున్నారు’’ అని అన్నారు. ఈ సంవత్సరం గానీ భవిష్యత్తులో గానీ జర్మనీలో చదువుకోవటానికి వెళ్లాలనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, విలువైన అంశాలను తెలుసుకోవాలనుకుంటే (వినాలనుకుంటే) ఈ కింది వీడియోని చూస్తే సరిపోతుంది.