NTV Telugu Site icon

SBI recruitment 2023: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Sbi

Sbi

ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 600 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 7లోపు అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అర్హతలు మొదలగు వివరాలను తెలుసుకుందాం..

అర్హతలు..

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దీనికి అర్హులే..

వయస్సు..

20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (2029 ఏప్రిల్‌ 1 నాటికి). రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది..

ఎంపిక విధానం..

ఆన్లైన్లో పరీక్షను రాయాల్సి ఉంటుంది.. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్‌ పరీక్ష ఫిబ్రవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష ఇంగ్లీష్‌, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు, మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి పావుమార్కు మైనస్ చేస్తారు..

జీతం..

సెలెక్ట్ అయినవారికి రూ. 18,900 నుంచి మొదలవుతుంది తరువాత అంచెలంచెలుగా పెరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు 8 నెలలు పాటు ప్రొబేషన్‌ పిరియడ్ ఉంటుంది…

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌..

దరఖాస్తుగడువు డిసెంబర్ 7గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://bank.sbi/web/careers/current-openings పరిశీలించగలరు.. మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోగలరు..