SBI recruitment 2023: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 600 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 7లోపు అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అర్హతలు మొదలగు వివరాలను తెలుసుకుందాం..
అర్హతలు..
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దీనికి అర్హులే..
వయస్సు..
20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (2029 ఏప్రిల్ 1 నాటికి). రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది..
ఎంపిక విధానం..
ఆన్లైన్లో పరీక్షను రాయాల్సి ఉంటుంది.. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్ పరీక్ష ఫిబ్రవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు, మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి పావుమార్కు మైనస్ చేస్తారు..
జీతం..
సెలెక్ట్ అయినవారికి రూ. 18,900 నుంచి మొదలవుతుంది తరువాత అంచెలంచెలుగా పెరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు 8 నెలలు పాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది…
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్..
దరఖాస్తుగడువు డిసెంబర్ 7గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://bank.sbi/web/careers/current-openings పరిశీలించగలరు.. మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోగలరు..
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!