Site icon NTV Telugu

SBI Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకులో 2వేల ఉద్యోగాలు..

Sbi

Sbi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు..

ఖాళీల వివరాలు..

మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు 2000 ఉండగా.. కేటగిరీల వారీగా చూస్తే..
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్‌- 200,
యూఆర్‌- 810..

వయో పరిమితి..

ఏప్రిల్‌ 1, 2023 నాటికి 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. అదే సమయంలో 30 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్‌ క్రిమీలేయర్‌) మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ తదితరులకు ఐదేళ్లు చొప్పున వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

బ్యాంకు పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు..

జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. జనరల్‌ (పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్‌ (పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులు, ఓబీసీ, ఓబీసీ పిడబ్ల్యూబీడీ) అభ్యర్థులైతే ఏడు సార్లు రాసేందుకు ఛాన్స్‌ ఉంది. అదే ఎస్సీ/ఎస్సీ పీడబ్ల్యూబీడీ/ఎస్టీ/ఎస్టీపీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు ఎన్నిసార్లయినా రాయొచ్చు.

దరఖాస్తు ఫీజు..

జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

సెప్టెంబర్‌ 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు ఉంటుంది.
నవంబర్‌లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష; డిసెంబర్‌/జనవరిలో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష; జనవరి/ఫిబ్రవరిలో సైకోమెట్రిక్‌, ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి/మార్చిలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది..

జీతం..
ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ పే రూ.41,960 (ఇతర సౌకర్యాలు అదనం)

ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ ను బాగా చూసి అప్లై చేసుకోగలరని మనవి..

Exit mobile version