Site icon NTV Telugu

SBI Recruitment 2023: ఎస్బీఐ లో 439 ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్..

Sbi

Sbi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6. అంటే ఈరోజుతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ముగుస్తుంది.. అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీలు.. 439

ఈ రిక్రూట్మెంట్ ద్వారా 45 కేటగిరీల్లో మొత్తం 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఆసక్తి, అర్హత ఉండి, ఇప్పటివరకు ఈ పోస్ట్ లకు అప్లై చేయని అభ్యర్థులు వెంటనే ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లోని sbi.co.in/web/careers లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. విద్యార్హతలు, వయోపరిమితి ఒక్కో పోస్టుకు ఒక్కోలా ఉన్నాయి.. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ముందుగా sbi.co.in వెబ్ సైట్ లోని సమగ్ర నోటిఫికేషన్ ను పూర్తి పరిశీలించి అప్లై చెయ్యగలరు..

మరింత సమాచారం..

అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 6.
ఆన్ లైన్ ఎగ్జామ్ డిసెంబర్ చివర్లో కానీ, 2024 జనవరి మొదట్లో కానీ ఉంటుంది.
పరీక్షకు 10 రోజుల ముందు నుంచి sbi.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ల ద్వారా చెల్లించవచ్చు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా sbi.co.in/web/careers వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
పైన కనిపించే join SBI ను క్లిక్ చేయండి. అనంతరం current openings ను క్లిక్ చేయండి
apply online పేజ్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి
అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.. ఇక చివరగా అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..

Exit mobile version