NTV Telugu Site icon

SAIL Recruitment : సెయిల్​లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Jobbss

Jobbss

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం సెయిల్లో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. మొత్తం 41 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఆఖరి తేదీ 2024 జనవరి 11తో ముగుస్తుంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

వేకెన్సీలు:- ఏజీఎం (ఈ-5) (మెకానికల్​/ ఎలక్ట్రికల్​/ సివిల్​)- 7 పోస్టులు.

ఏజీఎం (ఈ-5) (ప్రాజెక్ట్స్​)- 5 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (మెకానికల్​/ సివిల్​/ ఎలక్ట్రికల్​)- 12 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (మెటలర్జీ)- 2 పోస్టులు.

మేనేజర్​ (మెకానికల్​- హైడ్రాలిక్స్​) (ఈ-3)- 2 పోస్టులు.
మేనేజర్​ (ఈ-3) (ఐటీ)- 3 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (మైన్స్​) (ఓడీఓఎంలకు మాత్రమే)- 3 పోస్టులు.

మేనేజర్​ (ఈ-3) (ప్రాజెక్ట్స్​)- 5 పోస్టులు.

డిప్యూటీ మేనేజర్​ (ఈ-2) (పీ అండ్​ హెచ్​ఎస్​)- 1 పోస్టు.

అసిస్టెంట్​ మేనేజర్​ (ఈ-1) (జియోలాజీ) (ఓజీఓఎంలకు మాత్రమే)- 1 పోస్టు..

ఎంపిక విధానం..

కంప్యూటర్​ ఆధారిత టెస్ట్- ఇంటర్వ్యూ ఉంటాయి. లేదా కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉండొచ్చు.

అప్లికేషన్​ ఫీజు..

జెనరల్​, ఓబీసీ, ఈటీబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ. 700. ఎస్​సీ, ఎస్​టీ, ఈఎస్​ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 200..

వయస్సు..

ఐసీఎస్​ఎస్​ఆర్ రిక్రూట్​మెంట్​లో రీసెర్చ్​ అసిస్టెంట్​- లోయర్​ డివిజన్​ క్లర్క్​ పోస్టులకు అప్లై చేస్తున్న వారి వయస్సు 18-28ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక మిగిలిన పోస్టుల గరిష్ఠ వయస్సు పరిమితి 40ఏళ్లుగా ఉంది..

ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..