రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వేలో పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు… ఈ నోటిఫికేషన్ ప్రకారం 4660పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య..4660 పోస్టులు
పోస్టుల వివరాలు.. సబ్-ఇన్‌స్పెక్టర్-452, కానిస్టేబుల్-4208..
అర్హతలు..
ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అర్హత పొంది ఉండాలి..
వయసు..
పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
వేతనం..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొదటి నెల నుంచి రూ. 35,400 జీతం ఇస్తారు..
కానిస్టేబుల్..
పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు..
అభ్యర్థులకు 01.07.2024 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
వేతనం..
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ. 21,700 చెల్లిస్తారు..
ఎంపిక విధానం..
రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది:15.04.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:14.05.2024
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వాళ్లు అధికార వెబ్ సైట్ https://rpf.indianrailways.gov.in/RPF/ ను సందర్శించవచ్చు..