Site icon NTV Telugu

Railway Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..

Railway Jobs

Railway Jobs

నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా రైల్వేలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం రైల్వేలో ట్రైనీ అప్రెంటీస్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక సైట్ konkanrailway.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2023. అభ్యర్థులు నోటిఫికేషన్ లోని లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇక కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌లో 190 ఖాళీగా ఉన్న ట్రైనీ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన డిప్లొమా చేసి ఉండాలి..

వయస్సు..

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

విద్యార్హతల ప్రకారం అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం పిలవబడతారు.. ఆ తర్వాతే సెలెక్ట్ చేయబడతారు..

ఇక చివరగా క్యాంపెయిన్ కింద గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. డిప్లొమా అప్రెంటీస్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000 స్టైఫండ్‌ ఇస్తారు.. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ ను చూసి అప్లై చేసుకోగలరు..

Exit mobile version